ఉత్కంఠ పోరులో భారత్ విజయం

Sunday, January 31st, 2016, 05:56:24 PM IST

dhawan
ఆస్ట్రేలియా – భారత్ ల మధ్య ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 3 వ చివరి టీ – 20 మ్యాచ్ లో భారత్ విజయం సాదించి టీ – 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. వన్డే సిరీస్ లో ఘోర పరాజయం పాలైన టీమిండియా ఈ సిరీస్ లో గెలిచి పరువు నిలుపుకుంది. మునుపు జరిగిన రెండు టీ 20 మ్యాచ్ ల కన్నా ఈ చివరి మ్యాచ్ చివరి బంతివరకూ నువ్వా నేనా అన్నట్టు సాగింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా షేన్ వాట్సన్ సెంచరీతో 198 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. బ్యాటింగ్ కు దిగిన్ భారత్ ఓపెనర్లు ధావన్, రోహిత్ శర్మ లు ఇన్నింగ్స్ ను ధాటిగా మొదలుపెట్టారు. ధావన్ 9 బంతుల్లో 26, రోహిత్ 38 బంతుల్లో 52 పరుగులు చేసి ఔటవగా కోహ్లీ మరోసారి బ్యాట్ ఘుళిపించి 36 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరగా బ్యాటింగ్ కు దిగిన రైనా వేగంగా ఆడి 25 బంతుల్లో 49 పరుగులు చేయగా ఆఖరి ఓవరలో 17 పరుగులు చేయాల్సి ఉండగా యువరాజ్(15) వరుసగా ఫోర్, సిక్స్ బాదగా.. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా రైనా(49) ఫోర్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు.