డ్రాగా ముగిసిన మూడో టెస్ట్…ఆదుకున్న విహారి, అశ్విన్!

Monday, January 11th, 2021, 01:40:52 PM IST

ఆస్ట్రేలియా తో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ ను టీమ్ ఇండియా డ్రా గా ముగించింది. 407 పరుగుల లక్ష్యాన్ని టీమ్ ఇండియా చేదించలేకపోయినా, డ్రా గా ముగించడం తో ఆస్ట్రేలియా గెలుపు కి అడ్డుకట్ట వేసింది. సోమవారం నాడు 98/2 పరుగులతో మొదలు పెట్టిన టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ మరొక మూడు వికెట్లను కోల్పోయింది. మొత్తంగా 131 ఓవర్ లలో 334 పరుగులు చేసి మొత్తం ఐదు వికెట్లను కోల్పోయింది. అయితే అటు ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన భారత్ బ్యాట్స్ మెన్ ధీటుగా ఆడటం తో మ్యాచ్ డ్రా గా ముగిసింది.

రెండవ సెషన్ లో పంత్ మరియు పుజారా లు అర్థ సెంచరీ లతో టీమ్ ఇండియా ను ఆడుకోవడం లో కీలక పాత్ర పోషించారు. పంత్ 97 పరుగులు చేసి సెంచరి మిస్ అవ్వగా, పుజారా 77 పరుగులు చేశాడు. అనంతరం వచ్చిన విహారి మరియు అశ్విన్ లు నిలకడగా ఆడుతూ 258 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం తో మ్యాచ్ డ్రా గా ముగిసింది.