కరోనాలో మూడో స్థానానికి చేరిన భారత్.. రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు..!

Monday, July 6th, 2020, 12:07:32 PM IST

దేశ వ్యాప్తంగా కరోనా విళయ తాండవం చేస్తుంది. ప్రపంచంలోనే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాలలో భారత్ ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. దేశ వ్యాప్తంగా 6,97,413 కేసులు నమోదు కాగా, 19,693 మరణాలు సంభవించాయి.

అయితే గత వారం రోజులుగా 20 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, గడిచిన 24 గంటలలో దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24,258 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 425 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.