చివరి టీ-20లో ఓటమిపాలైన భారత్.. కానీ సిరీస్ గెల్చింది..!

Tuesday, December 8th, 2020, 06:27:35 PM IST

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ-20లో టీమిండియా 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ ఆరోన్‌ ఫించ్ ను‌ ఖాతా తెరవకముందే వాషింగ్టన్ సుందర్ పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్ మ్యాథ్యూ వేడ్ 80 పరుగులు, మ్యాక్స్‌వెల్ 54 పరుగులతో రాణించడంతో అసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.

అనంతరం 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా చివరివరకు పోరాడి ఓడిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 84 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా మిగతా బ్యాట్స్‌మెన్స్ ఎవరూ పెద్దగా రాణిచలేకపోయారు. అయితే మూడు టీ-20ల సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో భారత్ గెలుపొందడంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.