ఒబామాకు మైసూరు సిల్క్ శాలువా!

Friday, January 2nd, 2015, 06:07:32 PM IST

obama
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆహ్వానం మేరకు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా జనవరి 26న జరిగే గణతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరుకానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఒబామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మైసూరు శాలువాతో సత్కరించనున్నారు. అలాగే ఒబామాతో వస్తున్న బృందాన్ని కూడా రాష్ట్రపతి శాలువాలతో సత్కరించనున్నారు.

ఇక దీనికోసం రాష్ట్రపతి భవన్ నుండి 50 సిల్కు శాలువాలకు ఆర్డర్ వచ్చినట్లుగా కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ డి బసవరాజు పేర్కొన్నారు. అలాగే కొన్నేళ్ళ నుండి రాష్ట్రపతి భవన్ కు మైసూరు నుండే శాలువాలు భారీగా వెళుతున్నాయని ఆయన తెలిపారు. ఇక ఒబామాను మైసూరు శాలువాతో సత్కరించడం ద్వారా ఈ శాలువాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది.