భార్యను నరికేసి సూట్ కేసు లో అక్కడికి తీసుసుకెళ్లాడు..

Saturday, February 3rd, 2018, 11:00:58 PM IST

కొంత మంది ప్రవర్తిస్తున్న తీరు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చట్టాలు న్యాయాలు ఎన్ని ఉన్నప్పటికీ మనిషి కంట్రోల్ లో ఉండడం లేదు. చదువుకున్న వారే ఏ మాత్రం ఆలోచించకుండా మర్డర్ చేస్తుండడం షాక్ ని కలిగిస్తోంది. రీసెంట్ గా అదే తరహాలో లండన్ లో ఒక వ్యక్తి తన మాజీ భార్యను అతి దారుణంగా చంపేశాడు. దీంతో అతనికి 18 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. అసలు వివరాల్లోకి వెళితే,,
భారత సంతతికి చెందిన అశ్విన్‌ దౌడియా(51) – కిరణ్‌ దౌడియా(46) 2014లో విడాకులు తీసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

విడాకులు తీసుకున్నప్పటికీ వారు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే ఓ రోజు కిరణ్ ఆన్లైన్ డేటింగ్ కు సిద్ధమైందని తెలుసుకున్న అశ్విన్ ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. పట్టరాని కోపంతో ఆమె తలను పక్కకు తిప్పడంతో అక్కడిక్కడే కిరణ్ చనిపోయింది. దీంతో ఎం చేయాలో తెలియక అశ్విన్ ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి ఒక సూట్ కేసులో తీసుకెళ్లి లోయలో పడేశాడు. అనంతరం ఏమి తెలియని అమాయకుడిలా పోలీసుల వద్ద ముసలి కన్నీరు కార్చాడు. నా భార్య మిస్ అయ్యిందని చెప్పడంతో పోలీసులు సిసి కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అతను సూట్ కేసు కారులో ఎక్కించి తీసుకెళ్లడంతో పోలీసులు విచారించారు. చివరికి నిజం తెలియడంతో లండన్ కోర్టు అతనికి 18 సంవత్సరాల వరకు కారాగార శిక్షను విధించింది.