మూడోసారైనా మురిపిస్తారా.. ముంచేస్తారా..?

Sunday, January 17th, 2016, 11:33:42 AM IST


భారత్ – ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న వీబీ సిరీస్ లో మూడో వన్డే మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు ఆదివారం ప్రారంభమైంది. వరుసగా మొదటి రెండు మ్యాచ్ లలో భారీ స్కోర్ చేసి ఓటమిపాలైన భారత్ ఈసారైనా గెలుస్తుందా.. లేదా అని అభిమానులు ఆందోళనపడుతున్నారు. ఈసారి ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ కు దిగింది.

ఈ మ్యాచ్ తో జట్టులోకి బ్యాట్స్ మెన్ గురుకీరత్, బౌలర్ రిషి ధావన్ లు ఆరంగేట్రం చేయనున్నారు. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టులో ఆదిలోనే సూపర్ ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ 6 పరుగులు చేసి రిచర్డ్ సన్ బౌలింగ్ లో ఔటవగా కోహ్లీ(68), ధావన్(55) అర్థ సెంచరీలు పూర్తి చేసుకుని నిలకడగా ఆడుతున్నారు. భారత్ ఈ మ్యాచ్ గనక ఓడిపోతే సిరీస్ కోల్పోయినట్లే. ఇప్పటికి ఆస్ట్రేలియా 2 – 0 తో ముందంజలో ఉంది. ప్రస్తుతం 26 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 127 – 1 గా ఉంది.