అన్ని రాష్ట్రాల కంటే ఘోరంగా ఆంధ్ర ప్రదేశ్.!

Saturday, August 8th, 2020, 05:46:07 PM IST

ప్రస్తుతం కరోనా మూలాన ఏపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ విపత్కర కాలంలో జగన్ తీసుకున్న అనేక చర్యలు అతన్ని దేశంలోనే అత్యున్నత ముఖ్యమంత్రుల జాబితాలో మూడో స్థానంలో నిలిపాయి. టెస్టుల పరంగా ఓ ముఖ్యమంత్రి అండర్ లో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది అని చెప్పొచ్చు కానీ ఎంత సేపు టెస్టులు చేసి ఏం లాభం అసలు? రికవరీ రేటు మాట అడిగితే మాత్రం ఎవరి దగ్గరా సమాధానం ఉండకపోవచ్చు.

ఇదిలా ఉండగా అత్యుత్తమ సీఎం ల జాబితాలో జగన్ మూడో స్థానంలో ఉండొచ్చేమో కానీ రాష్ట్రాన్ని మాత్రం దుర్భర స్థితుల్లోకి నెట్టేశారు ప్రతిపక్షం టీడీపీ అంటున్న మాట. రికవరీ రేటులో ఏపీ అన్ని రాష్ట్రాల కంటే ఘోరంగా ఉందని టీడీపీ అధిష్టానం చేస్తున్న విమర్శ. ఏపీ రికవరీ రేటులో కేవలం 58 శాతంలోనే ఉందని, మన పక్క రాష్ట్రం తెలంగాణలోనే 70 శాతానికి పైగా రికవరీ ఉందని వారు అన్ని రాష్ట్రాల గ్రాఫ్ ను ముందుంచారు. దీనితో “కరోనా రికవరీలో అన్ని రాష్ట్రాల కంటే ఘోరంగా ఆంధ్రప్రదేశ్..” అంటూ టీడీపీ సోషల్ మీడియాలో జగన్ పై విమర్శలు కురిపిస్తున్నారు.