ఏప్రిల్ లో యువరాజు పట్టాభిషేకం..?

Wednesday, February 25th, 2015, 07:40:07 PM IST


ఏఐసిసి ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తున్నది. ఏప్రెల్ నెలలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశం తరువాత, ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీ, అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపడతారని సమాచారం.

యూపిఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా, రాహుల్ గాంధిని ప్రధానిని చేయాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. కాని, పాలనా అనుభవం కావాలనే ఉద్దేశ్యంతో రాహుల్ గాంధి ప్రధాని పదవిని చేపట్టలేదు. పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటూ.. పార్టీని బలోపేతం చేసేందుకు రాహుల్ ప్రయత్నించాడు. అయితే, గత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఘోరంగా దెబ్బతినడంతో…పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు రాహుల్ ను సిద్దం చేస్తున్నట్టు చేస్తున్నది. రాహుల్ గాంధి అధ్యక్షపదవిని చేపట్టి… పార్టీని తిరిగి పునర్వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ కలలు కంటున్నది. మరి ఆ కలలు నేరవేరతాయో లేదో వేచిచూడాలి.