2050 నాటికి ప్రపంచం ఇలా ఉంటుందా..?

Tuesday, February 16th, 2016, 02:00:39 PM IST


ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ ప్రపంచం ఎలా ఉన్నదో మనం చూస్తూనే ఉన్నాం. మరి మన భవిష్యత్తులోని ప్రపంచం ఎలా ఉంటుంది. ఎలా ఉండబోతున్నది. అప్పటి మనిషి ఎలా జీవిస్తాడు తదితర విషయాలపై ఉత్కంఠ ఉంటుంది అనడంలో సందేహం లేదు. 2050 లో మానవ ప్రపంచం ఎలా ఉంటుంది అనే దానిని ఆడమ్ స్మిత్ అనే సంస్థ ఓ అంచనా వేసింది. ఈ అంచనా ప్రకారం మనిషి మనుగడ ఎలా ఉండబోతుందో ఊహించారు. ఆ సంస్థ ఊహ ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం మనిషి అనేక జబ్బులకు మందులను కనుగొన్నాడు. అలాగే మనిషి జీవించడానికి కావలసిన అనేక ఆర్గాన్స్ ను కృత్రిమంగా తయారు చేస్తున్నాడు. కృత్రిమంగా తయారు చేసిన ఆర్గాన్స్ తో మనిషి మరింత ఎక్కువ కాలం జీవిస్తున్నాడు. ఇక జన్యుసంబంధమైన జబ్బులకు సైతం ల్యాబోరేటరిలో మెడిసిన్ తయారవుతుందట. ఇక, మనిషికి కావలసిన అన్ని రకాల సదుపాయాలు సమకూరుతాయట. ఇంట్లో వంటపని నుంచి ఇంటిపని చేయడానికి రోబోలు అందుబాటులో ఉంటాయి. అలాగే, ప్రతి ఇంటికి సోలార్ విధ్యుత్ అందుతుందట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.

డ్రైవర్ లెస్ కార్లు అందరికీ అందుబాటులోకి వస్తాయి. సూపర్ స్పీడ్ గా ప్రయాణించే సూపర్ సోనిక్ విమానాలు అందుబాటులోకి వస్తాయి. అదే విధంగా గాలిలోకి ఆక్సిజన్ ను ఇంధనంగా మార్చుకునే విమానాలు అందుబాటులోకి వస్తాయి. దీంతో ప్రయాణం ఖర్చు తగ్గిపోతుంది. పోషకవిలువలు కలిగిన కృత్రిమ మాంసం అందుబాటులోకి వస్తుందట. ఇలా మనిషికి కావలసిన అన్ని రకాల సదుపాయాలు భవిష్యత్తులో అందుబాటులోకి వస్తాయి. దీంతో మనిషి తన జీవనం గురించి ఆలోచిస్తాడని.. ఇతర పనుల గురించి ఆలోచించడని తద్వారా మనిషి రిలాక్స్ అవుతాడని..

దీంతో మనిషి వంద సంవత్సరాలు బ్రతుకుతాడని ఆడమ్ స్మిత్ సంస్థ పేర్కొంటున్నది. అంతేకాదు, ఎప్పుడో అంతరించిపోయిన డుడు, డైనోసారాస్ వంటి జంతువులు తిరిగి ప్రాణంపోసుకుంటాయట. అది ల్యాబోరేటరీలో. ప్రస్తుతానికి ఇదింతా ఊహే అయినప్పటికీ.. నిజం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆడమ్ స్మిత్ సంస్థ ఊహించిన దానిలో అన్ని జరగకపోయినా కొన్ని మాత్రం తప్పకుండా జరుగుతాయి అనడంలో సందేహం లేదని చెప్పొచ్చు.