గంధర్వుల కోసం పాడేందుకు వెళ్ళావా?

Saturday, September 26th, 2020, 03:00:58 AM IST


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం యావత్ భారతావని నీ శోక సంద్రంలో ముంచెత్తింది. అయితే తన ప్రాణ స్నేహితుడి మృతి తో సంగీత దర్శకుడు ఇళయరాజా భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు పలు వ్యాఖ్యలు చేశారు.నోట మాటలు రావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాలు, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటా అని చెప్పాను, త్వరగా తిరిగి రమ్మని చెప్పా, కానీ నువ్వు నా మాటలు వినలేదు, వెళ్ళిపోయావూ అని అన్నారు.

నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, గంధర్వుల కోసం పాడేందుకు వెళ్లావా,ఇప్పుడు ప్రపంచం లో దేన్నీ నేను చూడలేను, నాకు మాటలు రావడం లేదు, ఏం మాట్లాడాలో తెలియడం లేదు, ఏ దుఃఖానికి అయినా ఒక పరిమితి ఉంటుంది. కానీ నీ విషయం లో దానికి పరిమితి లేదు అంటూ ఇళయరాజా తన బాధని వ్యక్తం పరిచారు. ఆసుపత్రి లో ఎస్పీ బాలు చికిత్స పొందుతూ ఉన్న సమయం లో కంట తడి పెట్టుకుంటు చేసిన వ్యాఖ్యలు సైతం ఇప్పుడు అభిమానులను కంటతడి పెట్టేలా చేస్తున్నాయి.