కోవిడ్ ప్రోటోకాల్ నుండి ప్లాస్మా థెరపీ తొలగిస్తూ ఐసిఎంఆర్ కీలక నిర్ణయం!

Tuesday, May 18th, 2021, 09:04:44 AM IST

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ మరొక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. అయితే క్లిష్ట పరిస్థితుల్లో కరోనా సోకిన బాధితులకు అత్యవసర చికిత్స గా ప్లాస్మా థెరపీ ను ఉపయోగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్లాస్మా థెరపీ ను కరోనా ప్రోటోకాల్ నుండి తొలగిస్తూ ICMR కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కోవిడ్ ప్రోటోకాల్ టాస్క్ ఫోర్స్, వైద్య ఆరోగ్య శాఖ, ఎయిమ్స్ మరియు ఐసీఎంఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. అయితే ఇక ఈ ప్లాస్మా థెరపీ కరోనా చికిత్స ల నుండి తీసివేయడం జరిగింది.

అయితే కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వ్యక్తులు కొద్ది రోజులుగా ప్లాస్మా దానం చేస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పరిస్తితి విషమం గా ఉన్నవారికి బాధితులు ఇచ్చేవారు. అయితే అలా చేయడం ద్వారా యాంటీ బాడీలు తయారు అయి కరోనా ను అడ్డుకుంటాయి అని పలువురు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఒక వేరియంట్ సోకిన బాధితులకు వేరే వేరియంట్ సోకిన బాధితుల ప్లాస్మా ఇవ్వడం ద్వారా కొత్త మ్యుటేషన్ లు వచ్చే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరికలు జారీ చేశారు. అయితే తాజాగా ICMR తీసుకున్న నిర్ణయం తో ఇక ప్లాస్మా థెరపీ ఆగిపోనుంది.