గుడ్ న్యూస్: ఈ ఏడాది ఆగస్టు 15 వరకు భారత్ లో కోవిడ్-19 వాక్సిన్!

Friday, July 3rd, 2020, 01:50:12 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఐసీఎంఆర్ విడుదల చేసిన ఒక ప్రకటన లో ఆగస్ట్ 15 వరకు కరోనా వైరస్ మహమ్మారి కి వాక్సిన్ ను విడుదల చేస్తాం అని తెలిపింది. అయితే ఈ వాక్సిన్ ఇప్పటికే జంతువుల పై జరిపిన ప్రయోగాల్లో విజయవంతం కాగా, మానవుల పై ప్రయోగ దశ లో ఉన్నట్లుగా తెలిపింది.

అయితే ఇందుకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించింది. పుణె లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తో కోవాక్సిన్ ను బయోటెక్ తో కలిసి ఐసీఎం అర్ తయారు చేస్తోంది. ఇప్పటికే పలు కంపెనీ లు కరోనా వైరస్ వాక్సిన్ వస్తోంది అని ప్రకటించినా ఇంకా అందుబాటలోకి రాలేదు. అంతేకాక ప్రపంచ వ్యాప్తంగా రెండు, మూడు చోట్ల మాత్రం వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే భారత్ లో వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వందల సంఖ్యలో కరోనా వైరస్ భారిన పడి మృతి చెందుతున్నారు. అయితే ఐసిఎంఅర్ ప్రకటన తో కాస్త ఊరట లభించింది అని చెప్పాలి.