పీఎంవోలో ఛాన్స్ దక్కించుకున్న ఐఏఎస్ అమ్రపాలి..!

Monday, September 14th, 2020, 10:17:20 AM IST

మహిళా ఐఏఎస్ అధికారిణిగా మంచి పేరు సంపాదించుకున్న అమ్రపాలి మరో అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ఆమె ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. పీఎంవోలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో అమ్రపాలి స్థానం దక్కించుకున్నారు. 2023 అక్టోబర్ 27 వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు.

అయితే 2010 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన అమ్రపాలి తొలుత వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా విధులు చేపట్టారు. ఆ తరువాత రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. వరంగల్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో అమ్రపాలి చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళిపోయారు.