నా కూతర్ని సాధారణ అమ్మాయిగా పెంచాలని అంటున్న ప్రముఖ నటి !

Monday, February 19th, 2018, 12:34:37 PM IST

నటీమణులు చాలా వరకు వివాహానంతరం సినిమాల్లో నటనకు దూరంగా ఉంటుంటారు. ఆ కోవకు చెందినవారే ప్రముఖ బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ. 90వ దశకంలో అప్పటి బాలీవుడ్ అగ్రతారల్లో ఒకరుగా ఒక వెలుగు వెలిగిన ఆమె 2014 ఏప్రిల్‌లో బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆదిత్యా చోప్రాను వివాహం చేసుకున్నారు. వివాహానంతరం సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిన ఆమె దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ‘హిచ్‌కీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మార్చి 23న సినిమా విడుదల కాబోతోంది.ఇందులో రాణి పాఠశాల టీచర్‌గా కనిపించబోతున్నారు. నత్తితో బాధపడుతున్న ఒక స్త్రీ విద్యార్థులకు ఎలా పాఠాలు చెప్తుంది, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది అనే కథాంశం చుట్టూ ఈ చిత్రం సాగుతుందని సమాచారం.

ఇటీవల ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన కుమార్తె గురించి మాట్లాడుతూ నా కుమార్తెను చాలా సాధారణ అమ్మాయిగా పెంచాలి అనుకుంటున్నా, పాఠశాలలో అందరు చిన్నారుల్లాగే తనూ ఉండాలి అని కోరుకుంటున్నట్లు తెలిపార. నా కూతురి ఫొటోలను మీడియా వారు తరచూ తీయడం నాకు ఇష్టం లేదన్నారు. అయితే ఇంట్లో నా భర్తను రోజూ శపిస్తుంటాను. కానీ ఆ మందలింపు కోపంతో కాదు ప్రేమతోనే ఉంటుంది. మేమిద్దరం ద్వేషంతో ఎప్పుడూ మాట్లాడుకోం. నేను ఎవరినైనా శపిస్తున్నాను అంటే నిజంగా వారిని చాలా ప్రేమిస్తున్నాను అని అర్థం అని ఆమె తెలిపారు. కాగా ఆమె బాలీవుడ్ బాదుషాహ్ షారుఖ్ ఖాన్ స్వయంగా తన రెడ్ చిల్లీస్ బ్యానర్ పై నిర్మిస్తూ నటిస్తున్న జీరో చిత్రం లో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు…