బిల్లుల పై ప్రశ్నించినందుకు డాక్టర్ ను నిర్బంధించిన ఆసుపత్రి యాజమాన్యం!

Sunday, July 5th, 2020, 01:53:19 PM IST


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న క్లిష్ట సమయంలో ప్రజల వద్ద నుండి ఎక్కువగా మొత్తం లో ఫీజులు వసూలు చేస్తున్నారు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు. అయితే హైదరాబాద్ చాదర్ ఘాట్ లో ఒక ఆసుపత్రి లో ఇలానే జరుగుతుంది. ఈ ఘటన కి సంబంధించిన ఒక విషయం నేడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అధిక బిల్లులు వేస్తున్నారు అని ప్రశ్నించిన ఫీవర్ ఆసుపత్రి కి చెందిన డీ ఎం వో డాక్టర్ సుల్తానా ను తుంబే ఆసుపత్రి యాజమాన్యం నిర్బంధించింది.

కరోనా అనుమనితురాలుగా బాధపడుతున్న తనకు ఒక్క 24 గంటల్లోనే లక్ష 15 వేల రూపాయల బిల్లు ను వేసినట్లు సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. అయితే తను ఇలా ప్రశ్నించినందుకు వైద్య సదుపాయాలు సరిగ్గా అందించడం లేదు అని, నిర్బంధించి నట్లు తెలిపారు. కేవలం ఒక్క రోజుకి ఇలా వసూలు చేస్తే సామాన్య ప్రజల పరిస్తితి ఎంటి అని కొందరు వాపోతున్నారు. సుల్తానా కుటుంబ సభ్యులు మాత్రం తుంబె ఆసుపత్రి గుర్తింపు ను రద్దు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నారు.మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.