నటుడు సచిన్ జోషి ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

Thursday, October 15th, 2020, 11:14:07 AM IST

నటుడు సచిన్ జోషి ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గుట్కా అక్రమ రవాణా వ్యవహారం లో అతనిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ముంబై లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. భారీగా గుట్కా ను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారం తో సచిన్ జోషి పై ఐపిసి 273, 336 సెక్షన్ ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే నిర్మాతగా కూడా వ్యవహరించిన సచిన్ జోషి, తెలుగు లో పలు సినిమాలతో గతం లో అలరించిన సంగతి తెలిసిందే.