హైదరాబాద్ లో జనం ఎలా తయారయ్యారో చూడండి.!

Thursday, April 2nd, 2020, 10:45:39 AM IST


మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గత వారం కరోనా వైరస్ ప్రభావాన్ని ఆరంభంలోనే తుంచే ప్రయత్నం చేసి ఒకరోజు “జనతా కర్ఫ్యూ” ను ప్రకటించారు. కానీ అది సరిపోదని తెలిసే మొత్తం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నామని ఇది జనతా కర్ఫ్యూ ని మించి ఉంటుంది అని మరింత కఠినమైన చర్యలు తీసుకుంటే దానిని కాస్తా మన దేశస్థులు పూర్తిగా ప్లాప్ చేసి పారేస్తున్నారు.

కొన్ని చోటోలా పరిస్థితులు బాగానే ఉన్నా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం జనం అసలు ఈ లాక్ డౌన్ ను పాటించడం లేదు. ఎక్కడ వరకు ఎందుకు మన హైదరాబాద్ లోనే జనం గుంపులు గుంపులుగా తిరిగేట్షున్నారు. కెసిఆర్ ఏమో ఒకపక్క లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వహించి తీరాలని అంటుంటే మొన్ననే శంషాబాద్ రైతు బజార్ దగ్గర వేలాది జనం దర్శనమిచ్చి షాకిచ్చారు.

ఇప్పుడు ఇదే అనుకుంటే మళ్ళీ వెలది జనం ఉచిత రేషన్ కోసం కనీస దూరం కూడా పాటించకుండా దగ్గరదగ్గరగా ఉన్నారు.దీనితో వీరి తీరుపై సోషల్ మీడియా ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున వారిలో ఒకరికైనా కరోనా ఉంటే ఏంటి పరిస్థితి? ప్రభుత్వాలు ఎన్ని మాటలు జాగ్రత్తలు చెప్తున్నా సరే జనంలో మార్పు రాకపోతే వారు మాత్రం ఏం చేస్తారు.