GHMC: ప్రమాణ స్వీకారం చేయకుండానే బీజేపీ కార్పోరేటర్ మృతి..!

Thursday, December 31st, 2020, 09:01:51 PM IST

ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో లింగోజిగూడ నుంచి గెలిచిన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ కరోనా బారిన పడి కన్నుమూశారు. ఇంకా కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం చేయకముందే ఆకుల రమేష్ గౌడ్ మృతిచెందడంతో బీజేపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రమేష్ గౌడ్ మృతి పట్ల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

అయితే గతంలో ఎల్బీనగర్ మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన రమేశ్ గౌడ్ మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికలలో తన ప్రత్యర్థి సిట్టింగ్ కార్పొరేటర్ టీఆర్ఎస్ నేత ఎం.శ్రీనివాసరావు మీద గెలుపొందారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన మూడు రోజులకే రమేష్ గౌడ్ కరోనాతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితమే ఆయన తుదిశ్వాస విడిచారు.