డేంజరస్ గా హైదరాబాద్ వరదలు…కొట్టుకుపోతున్న వ్యక్తి!

Wednesday, October 14th, 2020, 11:54:04 AM IST

హైదరాబాద్ లో వరదలు ఎక్కువగా అయ్యాయి. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. చాలా వరకు హైదరాబాద్ లో కాలనీలు నడుము లోతు వరకు వరద నీరు చేరడం తో వర్షాలు మరింత డేంజరస్ గా ఉన్నాయి. అయితే ఇప్పటికే వర్షాల కారణంగా పలువురు మృతి చెందగా, ఫలక్ నుమా, బార్కస్ వద్ద ఒక వ్యక్తి వరదల్లో కొట్టుకుపోతున్న వీడియో ప్రజలను మరింత భయాందోళన కి గురి చేస్తోంది.

ఇప్పటికే అధికారులు, ప్రజా ప్రతినిధులు వరదలు, వర్షాల విషయం లో ప్రజలను అప్రమత్తం చేయగా, భారీ వర్షాల కారణంగా ఎవరూ బయటికి రావొద్దు అంటూ పలు చోట్ల ఆంక్షలు విధించారు. రానున్న రెండు రోజులు వీటి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.