హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్ అందించిన టీఆర్ఎస్ సర్కార్..!

Saturday, December 19th, 2020, 04:45:01 PM IST

హైదరాబాద్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ జలమండలి ద్వారా నగరవాసులకు ప్రతినెలా 20 వేల లీటర్ల తాగు నీరు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అయితే డిసెంబర్ నెల నుంచి 20వేల లీటర్ల తాగు నీటి వినియోగానికి కూడా ఎలాంటి రుసుము తీసుకోమని స్పష్టం చేశారు.

అయితే ఈ పథకం అమలకు సంబంధించి తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, జలమండలి అధికారులతో మంత్రి కేటీఆర్ సుధీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ఉన్న మొత్తం కనెక్షన్లు మరియు నీటి సరఫరాకి అవసరమైన ఏర్పాట్లు, ఈ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన విధి విధానాలను రూపొందించాల్సిందిగా అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమానికి సంబంధించిన సమాచారం కూడా ప్రజలకు సంపూర్ణంగా చేరేలా జలమండలి చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.