హైదరాబాద్‌లో రోడెక్కనున్న సిటీ బస్సులు.. ఎప్పటినుంచంటే?

Wednesday, September 23rd, 2020, 07:23:35 AM IST

తెలంగాణలో కేసుల సంఖ్య కాస్త తగ్గుతూ వస్తుంది. అయితే రికవరీ రేటు పెరుగుతుండడం, మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉండడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే మెట్రో రైళ్లు నడుస్తుండడంతో ప్రయాణికులకు బస్సులు కూడా అందుబాటులోకి వస్తే మరింత సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

అయితే ఏపీలో తెలంగాణ కన్నా 70 శాతం కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అయినా విజయవాడ, విశాఖపట్నంలో బస్సులు తిప్పుతున్నారని అలాంటప్పుడు హైదరాబాద్‌లో కూడా సర్వీసులు ప్రారంభిస్తే బెటర్ అనే ఆలోచనకు వచ్చారు. అయితే ఈ నెలాఖరు నాటికి లేదా అక్టోబర్ ఆరంభంలో సిటీలో బస్సు సర్వీసుల ప్రారంభంపై ప్రకటన రానున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే బస్సుల్లో సగం సీట్లను ఖాళీగానే ఉంచేలా ప్లాన్ చేస్తున్నారని కాబట్టి అందుకు తగ్గట్లే టికెట్ల రేట్లు కూడా ఉండనున్నట్టు తెలుస్తుంది.