భార్య లేని లోటు తీర్చుకున్న భర్త.. మైనపు బొమ్మతో విగ్రహం..!

Tuesday, August 11th, 2020, 12:19:32 PM IST

ఈ సృష్టిలో భార్య, భర్తల అనుబంధం అనేది చాలా గొప్పది. పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసుకుని ఒకటయ్యే ఇద్దరు జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. అయితే ఓ భర్త ఇంట్లో గృహప్రవేశానికి తన భార్య లేదని ఆమె మైనపు విగ్రహాన్ని తయారుచేయించి గృహప్రవేశం చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా భార్య కొన్నేళ్ళ క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో మరణించింది. అయితే ఇటీవల ఆయన ఇంట్లో గృహప్రవేశం కార్యక్రమం ఉండగా భార్యపై ఉన్న ప్రేమతో ఆమె మైనపు బొమ్మను చేయించి ఇంటికొచ్చిన అతిధులందరిని ఆశ్చర్యపరిచారు. భార్యపై అతనికున్న ప్రేమను చూసి అందరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ప్రతి ఒక్కరు ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మైనపు బొమ్మ పక్కన కూర్చుని ఫోటోలు తీసుకున్నారు.