వరల్డ్ ప్రీమియర్ గా విడుదల అయ్యి భారీ టీఆర్పీ సొంతం చేసుకున్న ఉప్పెన

Thursday, April 29th, 2021, 01:45:19 PM IST

సుకుమార్ శిష్యుడు గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు తీసిన తొలి చిత్రం ఉప్పెన. ఈ చిత్రం సోషల్ మీడియా లో, థియేటర్లలో ఆఖరుకు బుల్లి తెర పై కూడా తన సత్తా చాటింది. యూ ట్యూబ్ లో ఉప్పెన పాటలు ఎంతగా ట్రెండ్ అయ్యయో అందరికీ తెలిసిందే. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కనక వర్షం కురిపించింది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ లు గా నటించిన తొలి చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అయితే తాజాగా ఈ చిత్రం వరల్డ్ ప్రీమియర్ గా స్టార్ మా లో ప్రసారం అయ్యింది. అయితే దీనికి భారీ టీఆర్పీ రేటింగ్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం టెలివిజన్ లో ప్రసారం అయ్యి 18.5 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. అయితే బుల్లి తెర పై కూడా భారీ విజయం సాధించింది అని చెప్పాలి. బుచ్చిబాబు సన దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ను సుకుమార్ రైటింగ్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం లో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ఇంత విజయం సాధించడానికి సంగీతం కూడా ముఖ్య భూమిక పోషించింది అని చెప్పాలి. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించారు. అయితే అంతటా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఉప్పెన ఇంకా ఎన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి.