ఏపీలో భారీగా హాట్‌స్పాట్ జోన్లు.. ఏ జిల్లాలో ఎన్నంటే..!

Saturday, August 1st, 2020, 09:43:33 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తుండడంతో ఏకంగా కరోనా కేసుల సంఖ్య లక్ష యాభై వేలు దాటింది. అయితే కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలను చేపడుతున్నప్పటికి కూడా రోజుకు పదివేల కేసులు నమోదవుతున్నాయి.

అయితే ఈ నేపధ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా భారీ స్థాయిలో హాట్‌స్పాట్ జోన్లను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 396 ప్రాంతాలను హాట్‌స్పాట్స్‌గా ప్రభుత్వం ప్రకటించింది. అయితే నెల్లూర్ జిల్లాలో 60 ప్రాంతాలు, కర్నూల్‌లో 53 ప్రాంతాలు, కృష్ణాలో 43, చిత్తూర్‌లో 37, అనంతపురంలో 24, గుంటూరులో 35, తూర్పు గోదావరిలో 34, పశ్చిమ గోదావరిలో 28, విశాఖలో 34, ప్రకాశంలో 21, కడపలో 20, విజయనగరంలో 4, శ్రీకాకుళం జిల్లాలో 3 ప్రాంతాలు ఉన్నాయి.