లెబనాన్ రాజధాని బీరుట్ లో భారీ పేలుళ్లు..!

Wednesday, August 5th, 2020, 01:03:10 AM IST


లెబనాన్ రాజధాని అయిన బీరుట్ లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఒక్కసారిగా పేలుళ్లు సంభవించడం తో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. అయితే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉంటుంది అని అక్కడి వారు బావిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు, ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అయితే ఈ పేలుళ్లు భారీగా ఉండటం తో ఇల్లు చాలా ద్వంసమ్ అయ్యాయి. అంతేకాక వాహనాలు కూడా భారీ స్థాయిలో ద్వంశం అయ్యాయి. చాలా మంది గాయాల భారిన పడ్డారు అని, ఆస్తి నష్టం కూడా భారీగా జరిగి ఉంటుంది అని అక్కడ కొన్ని కథనాలు వస్తున్నాయి. అయితే బ్లాస్ట్ కి సంబంధించిన వీడియో లు సోషల్ మీడియా లో చాలా వైరల్ అవుతున్నాయి.

అయితే భారీ పేలుళ్లు సంభవించ డం పట్ల దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అక్కడి ప్రజలు అరుపులు, కేకలతో అక్కడి ప్రదేశం భయానక వాతావరణం ను సృష్టించింది.