హనీమూన్ ప్లాన్స్ ఏమిలేవంటున్న సమంత ?

Saturday, October 14th, 2017, 01:31:53 PM IST

అక్కినేని నాగ చైతన్యను ఈ నెల 6న పెళ్లి చేసుకున్న సమంత .. మళ్ళీ కొత్త ఉత్సాహంతో సినిమాల్లో బిజీగా మారింది. ఆమె నాగార్జునతో కలిసి నటించిన రాజుగారి గది2 సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో సమంత జోరు ఇంకాస్త పెరిగింది. తాజాగా సమంతకు ప్రశ్నల వర్షం ఎక్కువైందట, ఆ ప్రశ్న ఏమిటో తెలుసా .. పెళ్లి అయిపోయిందికదా .. మరి హనీమూన్ ఎప్పుడు ? అని అందరు అడుగుతున్నారట !! డైరెక్ట్ గానే కాదు .. సోషల్ మీడియా లో కూడా ఇదే దుమారం రేగుతోంది .. దాంతో ఈ విషయం పై స్పందించిన సమంత .. ప్రస్తుతం హనీమూన్ ప్లాన్స్ ఏమిలేవని ..సినిమాలతో బిజీగా ఉన్నాను కాబట్టి ఈ సినిమాలన్నీ పూర్తీ చేసిందాకా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశామని చెప్పింది ? సావిత్రి తాజాగా నటిస్తున్న మహానటి షూటింగ్ లో రేపటినుండి పాల్గొంటుంది. సో ఈ నెలంతా మహానటి షూటింగ్ లో బిజీగా ఉండే సమంత .. ఆ తరువాతె మిగతా కార్యక్రమాలు మొదలు పెడుతుందేమో మరి !!