వెలగపూడి బాధితులను పరామర్శించిన హోమ్ మంత్రి సుచరిత

Monday, December 28th, 2020, 01:33:52 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతం అయిన వెలగపూడి లో ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రాళ్ల దాడి ఘటన కారణంగా రాష్ట్ర హోమ్ మంత్రి సుచరిత ఆ ప్రాంతంలో పర్యటించారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులను హోమ్ మంత్రి పరామర్శించారు. ఈ ఘటన పై సమగ్ర విచారణకు ఆదేశాలను జారీ చేశామని తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసుల పాత్ర ఏదైనా ఉంటే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే మృతురాలి కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. అంతేకాక పిల్లల్లో ఒకరికి విద్యార్హత ప్రకారం ఉద్యోగం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

అయితే బాధిత కుటుంబాలు ఎంపీ పాత్ర పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు హోమ్ మంత్రి తో పాటుగా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మరియు ఎంపీ నందిగం సురేష్ లో సంఘటన స్థలిని పరిశీలించారు. అయితే వెలగపూడి లో జరిగిన ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.