టీడీపీ కుల రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటుంది – హోం మంత్రి సుచరిత

Thursday, August 13th, 2020, 04:45:03 PM IST

Sucharita

పాదయాత్ర లో ఇచ్చిన హామీ ప్రకారమే సీఎం జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారు అని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రాష్ట్రంలోని మహిళలు ఈ పథకం పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 23 లక్షల మంది మహిళలకు లబ్ది చేకురింది అని తెలిపారు. అయితే మీడియా సమావేశం లో మాట్లాడిన హోం మంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు పై ఘాటు విమర్శలు చేశారు.

మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు ది అని అన్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఇప్పటికే మహిళల కోసం పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని వివరించారు. రాష్ట్రం లోని 30 లక్షల మంది మహిళల కి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తోందని, కానీ టీడీపీ అడ్డుకుంటుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. తమ ఉనికిని కోల్పోతాం అనే భయం తోనే ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. దళితుల పై దాడి జరిగితే ప్రభుత్వం వెంటనే స్పందించింది అని, టీడీపీ మాత్రం కుల రాజకీయాలు చేస్తూ పబ్బమ్ గడుపుకుంటుంది అని ఘాటు విమర్శలు చేశారు.