కరోనా సోకినప్పుడు చాలా భయపడ్డా – మహమూద్ అలీ

Thursday, August 20th, 2020, 09:29:20 PM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ కరోనా వైరస్ భారిన పడుతున్న వారు ఎక్కువగా నమోదు అవుతున్నారు. ప్రజా ప్రతినిదులు సైతం ఈ వైరస్ భారిన పడుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ సైతం కరోనా వైరస్ భారిన పడి కోలుకున్న వారే. ఈ నేపధ్యంలో కరోనా వైరస్ ను ఎదిరించెందుకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాస్మా దానం చేయడం వలన కొంతమంది జీవితాలను కాపాడుకోవచ్చు అని పేర్కొన్నారు. అయితే ఈ కరోనా వైరస్ మహమ్మారి పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది అని హోం మంత్రి అన్నారు.

అయితే తనకు కరోనా వైరస్ సోకినప్పుడు చాలా భయపడినట్లు మీడియా ద్వారా వెల్లడించారు. ఆస్తమా ఉన్నప్పటికీ కూడా కరోనా ను ధైర్యం గా ఎదుర్కొన్నాను అని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన తెలంగాణ రాష్ట్రం లో కరోనా మరణాల శాతం చాలా తక్కువ గా ఉంది అని వ్యాఖ్యానించారు. ఈ మహమ్మారి వ్యాప్తి ను అరికట్టడం లో పోలీసులు బాగా పని చేశారు అని ప్రశంసల వర్షం కురిపించారు.ఈ మహమ్మారి కారణం గా హైదరాబాద్ లో చాలా వ్యాపారాలు దెబ్బ తిన్నాయి అని, ప్రతి ఒక్కరూ కూడా కరోనా జాగ్రత్త చర్యలు పాటించాలి అని ప్రజలను కోరారు.