చంద్రబాబు కి సవాల్ విసిరిన హోం మంత్రి సుచరిత

Tuesday, August 18th, 2020, 03:00:40 AM IST


తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పార్టీ పై చేస్తున్న ఆరోపణలకు గానూ వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకొనే వ్యక్తిత్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హోం మంత్రి సుచరిత. రాష్ట్ర ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారు అను, కుట్ర పూరితంగా నే, ప్రభుత్వం పై తప్పుడు కథనాలు రాయించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాయడం కూడా కుట్ర లో భాగం అంటూ ఆరోపించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు ఉంటే చూపించాలి అని సవాల్ విసిరారు. అయితే చంద్రబాబు కి ఇక రాజకీయ భవిష్యత్ లేదనే భయంతో ఇలా కుట్రలు చేస్తున్నారు అని తెలిపారు. అయితే నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు అని తెలిపారు. గతంలో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే చంద్రబాబు కుట్రలను ప్రజలే తిప్పి కొడతారు అని, అయితే నిరాధార ఆరోపణలు చేస్తే చట్ట పరమైన చర్యలకి సిద్దంగా ఉండాలి అని అన్నారు.