పలాస ఘటన పై హోంమంత్రి సుచరిత కీలక వ్యాఖ్యలు!

Thursday, August 6th, 2020, 12:04:55 AM IST


పలాస లో జరిగిన ఘటన పై హోమ్ మంత్రి మేకతోటీ సుచరిత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల పట్ల అత్యుత్సాహం, అలసత్వం ప్రదర్శించిన పోలీసుల పై చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు. అంతేకాక నేరాలకు పాల్పడిన వారు ఎంతటి వారు అయినా ఉపేక్షించేది లేదు అని, పలాస ఘటన లో దురుసుగా ప్రవర్తించిన సీఐ కాశీ పై వేటు వేసినట్లు తెలిపారు. అయితే తప్పు చేస్తే పోలీసులు కూడా అతీతులు కాదు అని, గత టీడీపీ ప్రభుత్వం తో పోల్చితే నేతలు తగ్గుముఖం పట్టాయి అని జగన్ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించారు.

అయితే దళిత వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించిన సీఐ సస్పెండ్ వ్యవహారం పై హోమ్ మంత్రి మాట్లాడారు. సీఐ పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశాం, అలానే దిశ పోలీస్ స్టేషన్ ల ఏర్పాటు తో మహిళల పై జరిగే నేరాల సంఖ్య సైతం తగ్గుముఖం పట్టింది ,రాష్ట్ర ప్రభుత్వం నేరాల సంఖ్య ను తగ్గించేందుకు చిత్త శుద్ధితో పని చేస్తుంది అని వ్యాఖ్యానించారు. అయితే పలాస ఘటన లో సీఐ ప్రవర్తించన తీరు పట్ల సస్పెండ్ మాత్రమే కాక, అరెస్ట్ కూడా చేసినట్లు తెలుస్తోంది.