బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కి సోకిన కరోనా!

Sunday, August 2nd, 2020, 05:23:36 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ కూడా విడిచిపెట్టడం లేదు. తాజాగా భారతదేశ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కి కరోనా వైరస్ సోకింది. అయితే ఈ విషయాన్ని స్వయం గా ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడం తో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు. అయితే రిపోర్ట్ లో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఈ విషయం తెలిసిన అనంతరం తాను గత కొద్ది రోజులుగా కలిసిన వారు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలి అని సూచించారు. కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకొని ఐశోలేశన్ లో ఉండాలని తెలిపారు.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రోజుకి దేశం లో వందల సంఖ్యలో ప్రాణాలను కోల్పోతున్నారు. వేల మంది కరోనా వైరస్ భారిన పడుతున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, కరోనా వైరస్ పోరు కి ఉన్న వైద్యులు, పోలీసులు ఏ ఒక్కరినీ కూడా కరోనా వైరస్ వదలడం లేదు. అయితే కరోనా వైరస్ ను అరికట్టడానికి ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని, స్వీయ నిర్బంధం లో ఉండాలి అని వైద్యులు సైతం సూచిస్తున్నారు.