కరోనా బులెటిన్ రోజూ విడుదల చేయండి.. తెలంగాణ సర్కార్‌పై హైకోర్ట్ ఆగ్రహం..!

Thursday, February 25th, 2021, 03:57:04 PM IST

తెలంగాణ సర్కార్‌పై హైకోర్ట్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై, బులెటిన్ నిలిపివేతపై హైకోర్ట్ నేడు విచారణ చేపట్టింది. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్న కారణంగా వారానికి ఒకసారి కరోనా బులెటిన్ విడుదల చేయాలని ఇటీవల వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుపట్టిన హైకోర్ట్ కరోనా బులెటిన్ ప్రతి రోజూ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే కరోనా పరీక్షలపై కూడా ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. జనవరి 25 నుంచి ఈనెల 12 వరకు టెస్టుల వివరాలను నివేదికలో తెలిపింది. అయితే జూన్ 3 నుంచి డిసెంబర్ వరకు 3 సీరం సర్వేలు జరిగాయని చెప్పగా సర్వే నివేదిక సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో తెలిపింది. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానంపై కూడా ప్రభుత్వం విస్తృత ప్రచారం చేయాలని సూచించింది. దీనిపై తదుపరి విచారణను కోర్టు మార్చి 18కి వాయిదా వేసింది.