తెలంగాణ సర్కార్‌పై హైకోర్ట్ మరోసారి సీరియస్.. ఎందుకంటే?

Thursday, September 24th, 2020, 05:29:07 PM IST

తెలంగాణ సర్కార్‌పై హైకోర్ట్ మరోసారి మండిపడింది. నేడు కరోనాపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన హైకోర్ట్ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. కరోనా టెస్టులు సంఖ్య ఎందుకు తగ్గించారని ప్రశ్నించింది. మహారాష్ట్రలో రోజుకు లక్షన్నర టెస్టులు చేస్తున్నారని, తెలంగాణలో రోజుకు 40 వేల పరీక్షలు చేస్తామన్న హామీ ఎందుకు అమలు కావడం లేదని అన్నారు.

అంతేకాదు వ్హో ప్రమాణాలకు అనుగుణంగా ఆసుపత్రులలో బెడ్లు ఎందుకు లేవని కూడా హైకోర్టు ప్రశ్నించింది. మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ ఎందుకు వెనకబడి ఉందో సమాధానం చెప్పాలని కోరింది. ఆక్సిజన్ బెడ్లు పెంచే ప్రణాళికలు ఉన్నాయో లేదో చెప్పాలని తెలిపింది. అయితే హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తండ్రి కరోనాతో చనిపోవడంతో పూర్తి నివేదిక సమర్పించేందుకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. దీంతో ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 8కి వాయిదా వేసింది.