ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారు.. తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు సీరియస్..!

Wednesday, December 16th, 2020, 09:32:22 PM IST

తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు సీరియస్ అయ్యింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వం కోర్టులో ఒక మాట చెప్పి, మరొకటి చేస్తుందని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చింది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు అమలు కావడం లేదని పిటీషనర్‌ తరపు న్యాయవాది కోర్టులో వాధించారు.

అయితే ఆధార్ కార్డు వివరాలు తీసుకోవద్దని గతంలో చెప్పినా ప్రభుత్వం వివరాలు సేకరిస్తుందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై రేపటి వరకు స్టే పొడిగించింది.