ఆ భూముల విషయంలో జగన్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్..!

Wednesday, November 4th, 2020, 07:52:14 PM IST

ఏపీ సర్కార్‌కు హైకోర్టులో మరోసారి చుక్కెదురయ్యింది. ఆలయ భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడంపై ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. విజయనగరం జిల్లాలోని గుంపం గ్రామంలో ఆలయ భూములను ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు కేటాయించింది. అయితే ఆలయ భూములను ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు భూమిని సిద్దం చేస్తున్నారని గుంపం గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు.

అయితే ఇళ్ల స్థలాలకు సిద్దం చేసిన భూములను వెంటనే నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు కాగా నేడు విచారణ చేపట్టింది. ఆలయ భూముల్ని ఇళ్ల స్థలాలకు ఇచ్చే నిబంధన ఎక్కడ ఉందని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది. అంతవరకు దీనిపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని అధికారులకు కోర్టు ఆదేశించింది.