ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పుతుంది.. హైకోర్ట్ సీరియస్ కామెంట్స్..!

Monday, September 14th, 2020, 03:32:57 PM IST

ఏపీ పోలీస్ వ్యవస్థపై హైకోర్ట్ సీరీయస్ అయ్యింది. అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అదృశ్యంపై హైకోర్టులో బాధితుడి మేనమామ సుంకర నారాయణ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో మూడు సార్లు జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని, ప్రతి సారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని వ్యాఖ్యానించింది.

అంతేకాదు ఏపీలో పోలీస్ వ్యవస్ద గాడితప్పుతుందని, రూల్ ఆప్ లా అమలు కావడం లేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో డీజీపీని పలుసార్లు కోర్టుకు పిలిపించిన మార్పు రాలేదని కోర్టు మండిపడింది. అయితే పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని చెప్పుకొచ్చింది. ఇక అలాగే ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది.