ఆ విషయంలో జోక్యం చేసుకోలేం.. తెలంగాణ హైకోర్ట్ క్లారిటీ..!

Monday, August 17th, 2020, 02:13:54 PM IST

తెలంగాణలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు నిండిపోవడంతో కొన్ని జిల్లాలలోని గ్రామాలు నీట మునిగాయి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం వరద సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టును కోరారు.

అయితే దీనిపై స్పందించిన హైకోర్ట్ వరద సహాయక చర్యల్లో హైకోర్టు జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది. అయితే వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితులపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించి సహాయక చర్యలను కూడా చేపడుతుందని, హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలను ప్రభుత్వం అప్రమత్తం చేసిందని వ్యాఖ్యానించింది. వరద ప్రాంతాలకు ప్రభుత్వం హెలికాప్టర్లను కూడా సిద్ధం చేసిందని, వరద పరిస్థితులపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని స్పందించాలన్న న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ అభ్యర్థనను హైకోర్ట్ తోసిపుచ్చింది.