అందుకు ఆస్తులు అమ్మాలా.. ఏపీ సర్కార్‌పై హైకోర్టు చురకలు..!

Friday, December 11th, 2020, 08:30:47 PM IST

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. మిషన్ బిల్డ్ ఏపీ పేరిట భూముల విక్రయంపై దాఖలైన పిటీషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడిందా అని ప్రశ్నించింది. అయితే దేశంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం చేస్తుందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

అయితే ప్రభుత్వం ఎంత బాగా పథకాలు అమలు చేస్తుందనేది ప్రతి ఒక్కరికి తెలుసునని కోర్టు చెప్పుకొచ్చింది. కరోనా సమయంలో మద్యాన్ని అధిక ధరలకు విక్రయించారని, ఆ సమయంలో రాష్ట్ర సంక్షేమానికి పాటుపడిన మందుబాబులకు నిజంగా కృతజ్ఞతలు చెప్పాల్సిందేనని కోర్టు వ్యంగ్యగా వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.