ఆ పిటీషన్ల విషయంలో ఏపీ సర్కార్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!

Saturday, November 7th, 2020, 03:06:46 AM IST

AP HighCourt gave an another shock to YSRCP government
ఏపీ సర్కార్‌పై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలను గమనిస్తున్నామని తెలిపింది. అసలు రాజ్యాంగ ప్రక్రియ ద్వారా పాలన జరుగుతుందా లేదా అన్న దానిపై విచారిస్తామని తెలిపింది. అంతేకాకుండా మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది శాసనమండలిలో వ్యతిరేకిస్తే ప్రభుత్వం శాసనమండలి రద్దుకు సిఫారుసు చేసిన విధానం కూడా తమ దృష్టిలో ఉందని వ్యాఖ్యానించింది.

అయితే రాష్ట్రంలో దాఖలవుతున్న హెబియస్ కార్పస్ పిటిషన్లను పరిశీలిస్తున్నామని తెలిపింది. ఇక న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్స్‌పై రిజిస్ట్రార్ జనరల్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా సీరియస్‌గా తీసుకోలేదని దీనిని కూడా తాము గమనిస్తున్నట్టు కోర్టు తెలిపింది. ఈ విషయంలో అఫిడవిట్ ఫైల్ చేయాలని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది.