ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురు..!

Thursday, December 3rd, 2020, 03:19:48 PM IST

ఏపీ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టులో మరోసారి చుక్కెదురయ్యింది. కరోనా కారణంగా వాయిదాపడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నియమించాలని ఈసీ ప్రకటించింది. అయితే ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అయితే ప్రభుత్వ పిటిషన్‌ను నేడు విచారించిన హైకోర్టు స్టేటస్ కో ఇచ్చేందుకు నిరాకరించింది.

అయితే హైకోర్టు నిర్ణయం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ న్యాయవాది అశ్వనీ కుమార్ చెప్పారు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయం సరికాదన్న ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా నేడు విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వం తరఫు న్యాయవాదితోపాటు ఈసీ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.