ఏపీ సర్కార్‌కు షాక్.. స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే ఇవ్వడం కుదరదన్న హైకోర్టు..!

Tuesday, December 8th, 2020, 05:07:54 PM IST

ఏపీ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల ప్రభావం ఇంకా తగ్గలేదని ఫిబ్రవరిలో ఎన్నికల ప్రక్రియను నిలిపివేసేలా ఎస్‌ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

అయితే ఈ పిటీషన్‌పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్టే ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎన్నికల కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.