ఏపీ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ..!

Tuesday, January 19th, 2021, 03:24:06 PM IST

High_court

ఏపీ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిదంటూ సీఐడీ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టి వేసింది. అమరావతి రాజధానిగా వస్తుందని ముందుగానే తెలుసుకుని అక్కడ భూములు కొనుగోలు చేసి లబ్ధీ పొందారని వైసీపీ ప్రభుత్వం ముందు నుంచి ఆరోపణలు చేస్తూ వస్తుంది. రాజధాని ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు కిలారు రాజేష్‌తో పాటుగా మరికొంత మందిపై సీఐడీ కేసులు నమోదు చేసింది.

అయితే భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా నమోదు చేస్తారని, కేవలం ఇది ప్రభుత్వ కక్ష సాధింపు మాత్రమే అని తనపై పెట్టిన కేసులను కొట్టి పారేయాలంటూ కిలారు రాజేష్‌ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ రాజేష్ తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఐపీసీ సెక్షన్లు వర్తించవని వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరగలేదని స్పష్టం చేస్తూ కిలారు రాజేష్‌తో పాటు మరికొందరిపై నమోదైన కేసులను హైకోర్ట్ కొట్టి పారేసింది.