జగన్ సర్కార్‌కి షాక్ ఇచ్చిన హైకోర్ట్.. ఆ భూములపై స్టే..!

Thursday, August 13th, 2020, 05:55:37 PM IST

ఏపీ సర్కార్‌కి హైకోర్ట్ మరో షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో పలు చోట్ల మైనింగ్ భూములను ఇళ్ల పట్టాల కోసం కేటాయించాలని ప్రభుత్వం భావిస్తుందని హైకోర్ట్‌లో పిటీషన్ దాఖలు అయ్యింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్ట్ రాష్ట్రంలోని మైనింగ్ భూములను ఇతర అవసరాలకు కేటాయించొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మైనింగ్ భూములపై కేంద్ర ప్రభుత్వానికే అధికారం అని దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ స్టే ఇచ్చింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్ట్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం చేపట్టాలనుకున్న ఇళ్ల పట్టాలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడం, ఇప్పుడు హైకోర్ట్ మైనింగ్ భూములపై స్టే విధించడంతో ఈ నెల 15న జరగాల్సిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడుతున్నట్టు సమాచారం.