ఎందుకింత నిర్లక్ష్యం.. తెలంగాణ సర్కార్‌పై హైకోర్ట్ సీరియస్..!

Thursday, August 13th, 2020, 02:55:45 PM IST

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్ట్ మరోసారి సీరీయస్ అయ్యింది. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో నేడు రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై హైకోర్ట్ విచారణ చేపట్టింది. గతంలో ఇచ్చిన ఏ ఆదేశాలు అమలు కావడం లేదని వ్యాఖ్యానించింది.

కరోనాపై ఎందుకు ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమని సీఎస్‌ సోమేష్‌కుమార్‌పై సీరియస్ అయ్యింది. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. అయితే అధిక ఫీజులు వసూల్ చేస్తున్న ఆస్పత్రుల లైసెన్సులు రద్దు చేశామని, ఇప్పటి వరకు 50 మందికి నోటీసులు కూడా పంపినట్టు సీఎస్ కోర్టుకు తెలిపారు. అయితే మిగిలిన ఆసుపత్రుల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని నిలదీసింది.