రూ.2.50 కోట్ల భూమి రూ.5 లక్షలకి కేటాయింపు…రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు!

Tuesday, August 11th, 2020, 12:03:56 AM IST

Telangana_highcourt
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాల పై హైకోర్టు ఇప్పటికే చాలా సార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పలు సూచనలను చేసింది. అయితే తాజాగా దర్శకుడు ఎన్.శంకర్ కి భూమి కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కి మొట్టికాయలు వేసింది హైకోర్టు. కోట్ల విలువ చేసే భూమిని ఎన్.శంకర్ అనే దర్శకుడికి ఎకరానికి 5 లక్షలకు మాత్రమే కేటాయించడం పట్ల హైకోర్టు లో పిటిషన్ దాఖలు అయింది. అయితే దీని పై నేడు హైకోర్టు విచారణ జరపగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే అక్కడ 50 కోట్ల రూపాయల తో స్టూడియో నిర్మించి, 300 మందికి ఉపాధి దొరికేలా చేస్తామని తెలిపారు. అయితే ఎన్.శంకర్ తరపున న్యాయవాది ఈ వ్యాఖ్యలు చేయగా, హెచ్ ఎం డి ఎ ఎకరం విలువ 2.50 కోట్ల రూపాయలు అని హైకోర్టు కి స్పష్టం చేసింది. అయితే ఏ ప్రాతిపదికన 5 లక్షలకు కేటాయించారు అని రాష్ట్ర ప్రభుత్వం ను నిలదీసింది. విలువైన భూమిని పల్లీల్లాగా పంచేస్తారా, 300 మందికి ఉపాధి కల్పిస్తామంటే భూమి ఇచ్చేస్తరా? కేబినెట్ నిర్ణయానికి ఒక ప్రాతిపదికన ఉండాలి అని, భూ కేటాయింపులు నిర్దిష్ట పద్దతిలో జరగాలని సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని తెలిపారు.