ఏపీ లో మునిసిపల్ ఎన్నికలకు తొలగిన అడ్డంకి… పిటీషన్ కొట్టివేత

Friday, February 26th, 2021, 02:39:37 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మునిసిపల్ ఎన్నికల కి అడ్డంకి తొలగిపోయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపిన విధంగానే మార్చి 10 వ తేదీన పోలింగ్ మరియు మార్చి 14 వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది అని ధర్మాసనం తెలిపింది. అయితే ఎన్నికల నిర్వహణ కి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కొందరు పిటీషన్ లు వేసిన సంగతి తెలిసిందే. అయితే నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలలు అవుతున్నాయి అని, అందుకే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయాలి అంటూ పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. అయితే కోర్టు మాత్రం పిటీషన్ ను కొట్టివేసి సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషనర్ సూచించిన విధంగా ఎన్నికలు ఉంటాయి అని తెలిపింది.