తెలంగాణ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్ట్..!

Thursday, March 18th, 2021, 05:09:08 PM IST

తెలంగాణ సర్కార్‌పై హైకోర్ట్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా టెస్టులు, చర్యలపై హైకోర్టుకు ఏజీ బీఎస్ ప్రసాద్ రిపోర్ట్ సమర్పించారు. మార్చి 7, 11వ తేదీలలో కేవలం 20వేల టెస్టులు మాత్రమే చేయడంపై హైకోర్టు ఆసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం ఆరోగ్య సిబ్బంది వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఉన్నారని, రాష్ట్ర సరిహద్దులు, రైల్వే, బస్‎స్టేషన్‎లో 300 మొబైల్ బస్సులతో టెస్టులు చేస్తున్నామని ఏజీ కోర్టుకు తెలిపారు.

అయితే రాష్ట్రంలో కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతున్న కారణంగా పబ్లిక్ గ్యాదరింగ్స్ పై ఆంక్షలు విధించాలని, అంత్యక్రియలు, పెళ్ళిల్లో 100 మందికి మించారదని తెలిపింది. రద్దీ ప్రాంతాల్లో, నిర్మాణ ప్రాంతాల్లో, స్కూళ్ల వద్ద టెస్టులు పెంచాలని హైకోర్టు సూచించింది. ర్యాపిడ్ టెస్టుల కంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని ఆదేశించింది. అంతేకాదు కేంద్రం విడుదల చేసిన ఎస్ఓపీ పాటించాలని, అదనపు వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు సూచించింది. ఈ కేసును వచ్చే నెలకు వాయిదా వేసింది.