వక్ఫ్‌ బోర్డు స్థలాల ఆక్రమణ.. తెలంగాణ సర్కార్‌పై హైకోర్ట్ ప్రశ్నల వర్షం..!

Friday, March 26th, 2021, 02:19:53 AM IST


తెలంగాణ సర్కార్‌పై హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వక్ఫ్‌ బోర్డు స్థలాల ఆక్రమణలపై నేడు విచారణ చేపట్టిన హైకోర్ట్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే మొత్తం 2,186 వక్ఫ్‌ బోర్డు ఆస్తులు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ దృష్టికి తీసుకెళ్లింది. అయితే దీనిపై స్పందించిన న్యాయస్థానం అందులో ఎన్ని స్వాధీనం చేసుకున్నారో చెప్పాలని ప్రశ్నించింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనిపై సరైన సమాధానం రాకపోవడం, ఆస్తుల స్వాధీనం వివరాలు లేకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దీనిపై ఏమీనా ఏర్పాటు చేశారా? అని విచారణ సందర్భంగా ప్రశ్నించిన హైకోర్టు టాస్క్‌ఫోర్స్‌లో ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు? అని కూడా ప్రశ్నించింది. అయితే జిల్లాల వారీగా దీనికి సమబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు ఈ కేసులో తదుపరి విచారణను జూన్ 10వ తేదీకి వాయిదా వేసింది.